అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు | - | Sakshi
Sakshi News home page

అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మనుబోలు: అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు తొక్కుతూ.. అక్రమాలను ఎలా చేయొచ్చో చూపుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ముద్దమూడిలో పార్టీ నేత కసుమూరు పెంచలయ్య కుమారుడు ప్రసాద్‌ గుండెపోటుతో మరణించడంతో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. వీరంపల్లికి చెందిన పార్టీ నేతలు అడపాల కృష్ణారెడ్డి, రమణమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో సోమిరెడ్డి అవినీతిపై ప్రజలు కథలు.. కథలుగా చెప్పుకొంటున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా ఆయన అవినీతి జాడలు తప్ప అభివృద్ధి కానరావడంలేదని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్‌ పనుల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన పనులను తాజాగా చేయించినట్లుగా కొత్తగా బిల్లులు చేసుకొని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అవినీతిలో భాగమైన అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించారు.

తీవ్ర కాలుష్యం

మనుబోలులోని సంగమేశ్వరస్వామి దేవస్థానం వద్ద పశువుల మేత కోసం జొన్న కంకులను నిల్వ చేస్తుండటంతో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందంటూ కాకాణికి పార్టీ నేతలు ిఫిర్యాదు చేశారు. దేవాలయాలకు సీసీ రోడ్లను గతంలో తాము వేశామని, వీటి ముందు సిమెంట్‌తో వరండాలను ఏర్పాటు చేయించామని చెప్పారు. అయితే ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ఆలయాలను సైతం సొంత అవసరాలకు అధికార పార్టీ నేతలు వాడుకుంటూ కాలుష్యానికి కారకులవుతున్నారని మండిపడ్డారు. సంగమేశ్వరాలయం వద్ద దుర్గంధంతో అక్కడ నివాసముంటున్న గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముత్తుకూరులో బల్కర్ల ప్రవేశంతో కాలుష్యం ఏర్పడుతోందని చెప్పి, చివరికి టన్నుకు రూ.40 చొప్పున యజమానుల వద్ద సోమిరెడ్డి వసూలు చేశారని దుయ్యబట్టారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, సూరపనేని కిశోర్‌నాయుడు, దాసరి భాస్కర్‌గౌడ్‌, జెట్టి సురేందర్‌రెడ్డి, గుర్రం ప్రభాకర్‌, చాంద్‌బాషా, ఆవుల తులసీరామ్‌, తుపాకుల గిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement