జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉధృతం | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉధృతం

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

ఆగిన ఎమర్జెన్సీ సేవలు

ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రదర్శన

నెల్లూరు(అర్బన్‌): జీఓను అనుసరించి తమకు స్టయ్‌పండ్‌ను పెంచాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో నగరంలోని సర్వజన ఆస్పత్రిలో సాధారణ సేవలతో పాటు అత్యవసర వైద్యసేవలను జూనియర్‌ డాక్టర్లు సోమవారం నుంచి ఆపేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆస్పత్రి ఆవరణ లో నిరాహార దీక్షలను చేపట్టారు. ఎమ్సీహెచ్‌ బ్లాక్‌, మెడికల్‌ కళాశాల తదితర ప్రాంతాల మీదుగా భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు హనీష్‌కుమార్‌ మాట్లాడారు. తెలంగాణ, తమిళనాడులో జూనియర్‌ డాక్టర్లకు పలు సౌకర్యాలున్నాయని, అయితే ఇక్కడ మాత్రం భద్రతలేదన్నారు. పని ఒత్తిడ్ని విపరీతంగా పెంచారని, రేయింబవళ్లూ పనిచేయాల్సి వస్తున్నా, ఓర్చుకొని రోగులకు వైద్యసేవలను అందిస్తున్నామని తెలిపారు. స్టయ్‌పండ్‌ను పెంచాలని అడగడమే నేరంగా చూడటం భావ్యం కాదన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. భార్గవ్‌, భావన, కీర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement