ఉదయగిరి రూరల్: మండలంలోని గండిపాళెం గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపుపై ఉదయగిరి ఇన్‌చార్జి ఎకై ్స జ్ సీఐ దీప్తి కరంత్ సిబ్బందితో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గొంతు కోసుకున్న
వ్యక్తి క్షేమం
గూడూరు: పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద అందరూ చూస్తుండగా మద్యం మత్తులో గొంతు కోసుకున్న వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వారి కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అజయ్ అనే వ్యక్తి పనుల నిమిత్తం గూడూరుకు వచ్చాడు. అతను పూర్తి వివరాలు వెల్లడించలేని స్థితిలో ఉన్నాడు. నెల్లూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్న తర్వాత వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.
14 ద్విచక్ర
వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు సుందరయ్యకాలనీ సీ బ్లాక్‌లో మంగళవారం రాత్రి వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎవరెవరు ఉంటున్నారు?, ఏం చేస్తుంటారు? తదితర వివరాలను సేకరించారు. పత్రాలు సక్రమంగా లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్, ఎల్‌హెచ్‌ఎంస్ సేవలు తదితరాలపై ప్రజలకు అవగాహన క ల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే డయల్ 112 లేదా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఎస్సై ప్రసాద్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


