స్థానిక యువకులే హంతకులు | - | Sakshi
Sakshi News home page

స్థానిక యువకులే హంతకులు

Aug 5 2026 12:06 AM | Updated on Aug 5 2026 12:06 AM

హత్య కేసును ఛేదించిన పోలీసులు

గూడూరు: యువకుడి హత్యను పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం గూ డూరు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గూడూరు రూరల్‌ సీఐ కిశోర్‌బాబు వివరాలు వెల్లడించారు. రూరల్‌ పరిధిలోని విందూరు గ్రామానికి చెందిన షేక్‌ షాహుల్‌ సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ అన్న ఇంట్లో ఉండేవాడు. అతడికి మద్యం అలవాటు ఉంది. తాగిన సమయంలో గ్రామస్తులను అసభ్యంగా దూషించేవాడు. దుస్తులు విప్పి రోడ్లపై తిరిగేవాడు. గత నెల 31వ తేదీన మద్యం తాగి ఒకచోట కూర్చొని ఉండగా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వెళ్లారు. మద్యం తాగుదా మని షాహుల్‌ను పిలిచారు. అతను వారితో వెళ్లగా అందరూ గ్రామంలోని పాఠశాల మిద్దైపెకి చేరి మద్యం తాగారు. మత్తులో షాహుల్‌ కులం పేరుతో వారిని దూషించడంతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో షాహుల్‌ను దారా మహేంద్ర, పోలిపాటి కామేష్‌, కాకి వెంకటేశ్వర్లు బాగా కొట్టి అతని గొంతు, తర్వాత మర్మాంగాన్ని కోశారు. సాంకేతికత ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఒకటో, రెండో పట్టణ సీఐలు శేఖర్‌బాబు, మాలకొండయ్య, ఎస్సైలు మనోజ్‌కుమార్‌, సురేష్‌బాబు, తిరుపతయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement