మధ్యవర్తిత్వంతో పెండింగ్‌ కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వంతో పెండింగ్‌ కేసుల పరిష్కారం

Aug 5 2026 12:06 AM | Updated on Aug 5 2026 12:06 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌

నెల్లూరు(లీగల్‌): మధ్యవర్తిత్వం ద్వారా వివిధ కోర్టుల్లోని పెండింగ్‌ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యవర్తిత్వ అవగాహన ర్యాలీని శ్రీనివాస్‌ ప్రారంభించి మాట్లాడారు. మధ్యవర్తిత్వ రాజీ మార్గాన్ని 2005లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రారంభించారని, ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. ర్యాలీ మద్రాస్‌ బస్టాండ్‌, మార్కెట్‌ వరకు సాగింది. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు ఆర్‌.శరత్‌బాబు, జి.గీత, పీజే.సుధ, శుభవాణి, షేక్‌.జానీబాషా, నిఖిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వైజే పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement