కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రూ.వెయ్యి కోట్లను కేటాయించి పొగాకును కొనుగోలు చేయాలి. గిట్టుబాటు ధరల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా, ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2020లో రూ.250 కోట్లతో 13 మిలియన్ కిలోల పొగాకును ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొనుగోలు చేయించి ఆదుకున్నారు.
– పూసాల అక్కపునాయుడు,
రావులకొల్లు, కలిగిరి మండలం


