కాలుష్యంతో బతకలేకున్నాం | - | Sakshi
Sakshi News home page

కాలుష్యంతో బతకలేకున్నాం

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

మా గ్రామాన్ని తరలించండి

సెయిల్‌ ఎదుట

నేలటూరుపాళెంవాసుల ఆందోళన

ముత్తుకూరు(పొదలకూరు) : ముత్తకూరు మండలం నేలటూరులోని సెయిల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఎదుట నేలటూరుపాళెం, ఎస్సీకాలనీవాసులు సోమవారం ఆందోళన చేపట్టారు. స్థానికులు పెద్దఎత్తున సెయిల్‌ ప్రధాన గేటు వద్దకు చేరుకుని కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన నిర్వహించారు. పరిశ్రమ కాలుష్యం కారణంగా వ్యాధుల బారిన పడుతున్నామని, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించాలని కోరారు. గతంలో పలుమార్లు కాలుష్య సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఈసారి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement