నెల్లూరు(వీఆర్సీసెంటర్): సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిని విజయవంతం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, స్ట్రగుల్ కమిటీ నాయకులు హజరత్తయ్య, జాకీర్‌హుస్సేన్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వీరు మాట్లాడారు. విద్యుత్ సంస్థల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను నేటికీ ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు హాజరుకావాలని కోరారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పెంచలప్రసా ద్, రామయ్య, మహేష్, హరినారాయణ, నాగయ్య, విజయరామిరెడ్డి, దయాకర్, రసూల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


