కారు బోల్తా– మహిళకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తా– మహిళకు గాయాలు

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

వెంకటాచలం: వేగంగా వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడి మహిళ గాయపడిన ఘటన మండల కేంద్రమైన వెంకటాచలంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు దైవదర్శనం నిమిత్తం ఓ కుటుంబం కారులో బయలుదేరింది. అయితే కారు వెంకటాచలం సమీపంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బైక్‌ అదుపుతప్పి..

మోటార్‌ బైక్‌ అదుపుతప్పి పడి యువకుడు గాయపడిన ఘటన మండలంలోని కాకుటూరు సమీపంలో శనివారం జరిగింది. గూడూరు నుంచి శ్రీనివాస్‌ అనే వ్యక్తి బైక్‌పై నెల్లూరుకి వెళ్తుండగా కాకుటూరు సమీపంలో అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement