ఆత్మకూరు: తాము అధికారంలోకి వచ్చాక డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళల కుమార్తెలకు వివాహాలు నిశ్చయమైతే పావలా వడ్డీకి రూ.లక్ష రుణాన్ని కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అందజేస్తామని గత ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చింది. అయితే వీరు గద్దెనెక్కి రెండేళ్లు దాటినా దీని అమలుపై ఏ మాత్రం దృష్టి సారించడంలేదు. వాస్తవానికి జిల్లాలో 39,505 స్వయం సహాయక సంఘాలు (పొదుపు సంఘాలు) ఉన్నాయి. ఇందులో 4,06,145 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో వీరు కీలక పాత్రను పోషిస్తున్నారు.
అప్పులే దిక్కు..
అప్పట్లో రూ.250 కోట్లను విడుదల చేసి తొలుత 25 వేల మందికి ప్రయోజనం కల్పిస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే ఇప్పటికీ అతీగతీ లేదు. ఫలితంగా పొదుపు మహిళలు తమ కుమార్తెల వివాహ సమయంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.రెండు నుంచి రూ.ఐదు వడ్డీకి అప్పులు తేవాల్సి వస్తోంది. బ్యాంక్ లింకేజీతో సున్నా వడ్డీ పథకంలో తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో కల్యాణ లక్ష్మి పథకం కూడా ప్రకటనగానే మిగిలిపోనుందాననే అనుమానాలు వీరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.
స్వయం సహాయక సంఘాలు
39,505
సభ్యుల సంఖ్య
4,06,145 మంది
మండల సమాఖ్యలు
37
గ్రామ సమాఖ్యలు
1215
జిల్లాలో ఇలా..
హామీ ఇచ్చి రెండేళ్లు
దాటినా.. ఏదీ ప్రయోజనం
పథకం అమలును విస్మరించిన
చంద్రబాబు
నిరీక్షిస్తున్న డ్వాక్రా, పొదుపు మహిళలు
అన్నీ బూటకపు హామీలే
చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో బూటకపు హామీలిచ్చారు. కల్యాణ లక్ష్మి పథకం సైతం ఇదే కోవలోకి చేరుతుందాననే అనుమానం కలుగుతోంది. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించిన ప్రతి పథకాన్నీ అమలు చేశారు. అయితే ప్రస్తుతం ఇలాంటివేవీ లేవు.
– పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, జెడ్పీటీసీ


