వరికుంటపాడు: మండలంలోని కొండాయపాళెం పంచాయతీ ధర్మవరంలో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. సర్వే నంబర్ 148 / 1లో ఉన్న సుమారు 3.3 ఎకరాల ల్యాండ్‌ను కొందరు టీడీపీ నేతలు ఆక్రమించి జేసీబీలతో చెట్లను తొలగించి చదును చేశారు. ఆపై చుట్టూ ముళ్ల తీగలతో ఫెన్సింగ్ వేసి, బోరును శనివారం వేయించడం గమనార్హం. సదరు స్థలం ప్రభుత్వానికి చెందిందంటూ ఇక్కడ బోర్డును ఏర్పాటు చేసినా, దాన్ని తొలగించి మరీ పని కానిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కరువవుతోందని పేర్కొన్నారు. కాగా ఈ అంశమై వీఆర్వో, తహసీల్దార్‌ను సంప్రదించేందుకు సాక్షి యత్నించగా, వారు స్పందించలేదు.


