తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ అతిథిగృహం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 67,063 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,565 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.81 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


