ఛత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

ఛత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసం

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

టీడీపీ నేతల పనిగా ఆరోపణలు

ఇందుకూరుపేట: మండలంలోని యాగర్ల సెంటర్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించారు. స్థానికుల కథనం మేరకు.. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి శివాజీ విగ్రహాన్ని పెట్టారు. బుధవారం ఉదయం దానిని ధ్వంసం చేసి పక్కన పడేశారు. విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన సిమెంట్‌ దిమ్మెను పగులగొట్టారు. కాగా టీడీపీ నాయకులే దీనికి ఒడిగట్టారని ఆరోపణలుస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకే ఇలా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement