● రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
పొదలకూరు: చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. ఒంటరి మహిళల మె డల్లోని బంగారు గొలుసులను లాక్కెడం నగర, పట్టణ ప్రాంతాల్లో జరిగేవి. ఇప్పుడు గ్రామాల్లోనూ దొంగలు పంజా విసురుతున్నారు. తాజా గా మంగళవారం రాత్రి మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ఇద్దరు యువకులు మోటార్‌బైక్‌పై వెళ్లి మహిళ మెడలోని బంగారు సరుడు లాక్కెడంతో కలకలం రేగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నరసింహకండ్రిక గ్రామం మెయిన్ రోడ్డులో దుకాణం నిర్వహిస్తున్న ఓ మహిళ మెడలోని గొలుసును ఇద్దరు యువకులు తెంపుకెళ్లారు. సరుకులు కొనుగోలు చేస్తునట్టు నటిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టారు. తొగలవీధిలో చిన్న బంకు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వృద్ధ మహిళ మెడలోని బంగారు చైన్‌ను ఏడాదిన్నర క్రితం గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. అంతకుముందు కూడా పట్టణంలో చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. పోలీసులు కొన్ని కేసులను ఛేదించి బంగారు రికవరీ చేయగా మరికొన్ని ఇప్పటికీ తేలకుండా ఉన్నా యి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన ఆభరణాలను ధరించవద్దని చెబుతున్నారు. పథకం ప్రకారం బైక్‌లపై వచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా పొలం పనులు, తోటల్లోకి వెళ్లే మహిళలు మెడల్లో బంగారు నగలను ధరించొద్దని తెలిపారు.


