న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు డిమాండ్‌

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

నెల్లూరు, (లీగల్‌): న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ జోనల్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ న్యాయవాది రామిరెడ్డి రోజారెడ్డి డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలంటూ పార్టీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని బుధవారం చేపట్టారు. ఆవరణ నుంచి బయల్దేరి మద్రాస్‌, ఆర్టీసీ బస్టాండ్ల మీదుగా కోర్టు వద్దకు ర్యాలీ చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లా నేస్తం ద్వారా జూనియర్‌ న్యాయవాదులకు ప్రతి నెల రూ.ఐదు వేల భృతిని గత ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు, ఇంటి స్థలంతో పాటు 16 అంశాలపై టీడీపీ హామీ ఇచ్చినా, దేన్నీ అమలు చేయలేదని ఆరోపించారు. న్యాయవాదులు, వారి కుటుంబసభ్యులకు ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఏపీపీ నియామకాలను వెంటనే జరపాలన్నారు. లీగల్‌ సెల్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ సిద్దన సుబ్బారెడ్డి, నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ మాజీ ప్రెసిడెంట్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర సెక్రటరీ రమాదేవి, జాయింట్‌ సెక్రటరీ శ్రీధర్‌, నెల్లూరు టౌన్‌, రూరల్‌, కోవూరు, సర్వేపల్లి ప్రెసిడెంట్లు కమలాకర్‌రెడ్డి, విద్యాధర్‌రెడ్డి, చెంచురెడ్డి, శ్రీనివాసులు, జిల్లా నేతలు శ్యామాచార్యులు, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement