తీరు మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు | - | Sakshi
Sakshi News home page

తీరు మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): పొగాకుకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా డీసీపల్లి పొగాకు బోర్డు కార్యాలయం వద్ద నిరసన చేపట్టేందుకు సిద్ధమైన వారిని అరెస్ట్‌ చేయడం.. కొందర్ని గృహ నిర్బంధంలో ఉంచడం దారుణమని, తీరు మార్చుకోకపోతే సర్కార్‌కు గుణపాఠం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పేర్కొన్నారు. బాలాజీనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గతేడాది కిలో పొగాకును రూ.320కు కొనుగోలు చేయగా, ఈ ఏడాది రూ.200కు కూడా సేకరించడంలేదని మండిపడ్డారు. మద్దతు ధర కోసం కర్షకులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే కూటమి ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అక్రమంగా అరెస్ట్‌ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాములు, నేతలు మెహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement