ఎటుచూసినా జనమే.. | - | Sakshi
Sakshi News home page

ఎటుచూసినా జనమే..

Jul 11 2026 12:24 AM | Updated on Jul 11 2026 12:24 AM

నెల్లూరు(అర్బన్‌): జనం.. జనం.. ఎటుచూసిన జనమే కనిపిస్తున్న రోజులివి. జనాభా పెరుగుదల వేగంగా జరుగుతోంది. పేదరికం, పేద దేశాలున్న చోట మరింత ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది. అయితే ఈ పెరుగుదలతో సహజ వనరులు అందరికీ అందవు. నివాస, వ్యవసాయం కోసం అడవులు నరికివేత కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహార కొరత ఏర్పడుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1989 నుంచి అధికారికంగా జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది.

జిల్లా జనాభా 26,62,536 మంది

జిల్లాలో 26,62,536 మంది ఉన్నారు. ప్రతి చదరపు కిలోమీటర్‌కు 229 మంది ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 31 శాతం నివసిస్తుండగా పల్లెల్లో 69 శాతం ఉంటున్నారు. 35 శాతం కుటుంబాలు తీవ్ర పేదరికం, అప్పుల్లో ఉన్నాయి. మరో 40 శాతం దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజలే. జనాభా పెరుగుదల పేదరికానికి మరో కారణం.

చంద్రబాబు ఇలా అంటారు

సీఎంగా చంద్రబాబు రాజకీయ కారణాల వల్ల ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సభల్లో చెబుతుంటారు. అయితే వారికి అవసరమైన విద్య, వైద్యం, గృహాలు, ఉపాధి సంగతి మాట్లాడటం లేదు. కేవలం ఓటు రాజకీయాలే చేస్తున్నట్లు మేధావులు విమర్శిస్తున్నారు.

ఆడపిల్లలపై వివక్ష

రాష్ట్ర జనాభాలో ప్రతి 1,000 మంది పురుషులకు 984 మంది ఆడపిల్లలే జన్మిస్తున్నారు. సరాసరి ఇద్దరు సమానంగా ఉండాలి. అందుకు విరుద్ధంగా ఆడబిడ్డలు తగ్గిపోతున్నారంటే స్కానింగ్‌ చేయించి బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. అయితే జిల్లాలో మాత్రం ప్రతి 1,000 మంది పురుషులకు 1,011 మంది ఆడపిల్లలున్నారు. ఇక్కడ సీ్త్ర జననాలు ఎక్కువ కావడం గుర్తించదగిన విషయమే.

నిరుద్యోగ సమస్య

జిల్లాలో 70 శాతం అక్షరాస్యత ఉంది. పలు పరిశ్రమలున్నా నిరుద్యోగం తాండవిస్తోంది. పౌష్టికాహారం సీ్త్రలకు, పేదలకు అందడం లేదు. అనారోగ్యానికి పూర్తి వైద్యం అందడం లేదు. జిల్లాలో 52 పీహెచ్‌సీలు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక బోధనాస్పత్రి (పెద్దాస్పత్రి) ఉన్నా వైద్యం అంతంతమాత్రంగా అందుతోంది.

ఎన్నో అనర్థాలు

జనాభా పెరిగితే భూమి కోసం అడవులు నరికేస్తున్నారు. నీటి వనరులు పాడవుతున్నాయి. వ్యర్థాలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా పలు రకాల జీవజాతులు అంతరిస్తున్నాయి. అందువల్ల సహజ వనరులను పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధి దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

వైద్యశాఖ ఆధ్వర్యంలో..

జనాభా పెరుగుదలతో వచ్చే నష్టాలపై శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నారు. ర్యాలీలు చేస్తారు. కుటుంబ నియంత్రణ పాటించిన వారికి, తక్కువ సంతానం ఉన్నవారికి లక్కీ డిప్‌ ద్వారా నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు.

వేగంగా పెరుగుదల

75 శాతం పేద, మధ్య తరగతి వారే..

పెరుగుదల సుస్థిర

అభివృద్ధికి ఆటంకం

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement