రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 30.18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
దశలవారీగా బిల్లుల
వసూళ్ల కేంద్రాల మూసివేత
చిత్తూరు కార్పొరేషన్: డిస్కం పరిధిలో విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలను దశలవారీగా మూసివేయనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ శుక్రవారం ప్రకటించారు. డిజిటల్ చెల్లింపుల పెంపు లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా బిల్లుల ఆన్‌లైన్ చెల్లింపులు మరింత పెరుగుతుందన్నారు. డిస్కం పరిధిలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లో మొత్తం 61.32 లక్షల మంది వినియోగదారులు ఉన్నారన్నారు. బిల్లుల చెల్లింపుల ద్వారా ప్రతినెలా సుమారు సంస్థకు రూ.520 కోట్లు వస్తోందన్నారు. ప్రస్తుతం 49.50 శాతం ఆన్‌లైన్ చెల్లింపులు జరుగుతున్నట్లు వెల్లడించారు. వీటిని దశలవారీగా 100 శాతం పెంచడమే లక్ష్యమన్నారు. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాలు (ఈఆర్‌ఓలు)లో కూడా ఆన్‌లైన్ చెల్లింపులకే ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.


