వేచి ఉన్న మహిళా ప్రయాణికులు
● ప్రయాణికులకు ఇబ్బందులు
కొడవలూరు(కోవూరు): ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్ కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ ఘటన మండలంలోని గండవరం ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కావలికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు గండవరం ఫ్లై ఓవర్ వద్దకు చేరుకునేసరికి బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు దిగిపోయారు. గమ్యాలకు చేరుకునేందుకు వెంటనే ప్యాసింజర్ బస్సు రాకపోవడంతో గంటల తరబడి ఇక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. కొందరు కాలి నడకన నార్తురాజుపాళెం కూడలికి చేరుకుని ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం వేచి ఉండి వాటిలో వెళ్లిపోయారు. కమ్మపాళెం, రాచర్లపాడు, సున్నపుబట్టి తదితర దగ్గర గ్రామాలకు వెళ్లే వారు ఆటోలను ఆశ్రయించి అధిక చార్జీలు చెల్లించారు. ప్రయాణికుల్లో అధిక భాగం మహిళలే ఉన్నారు.


