మల్లాం ఆలయ ఆదాయానికి గండి | - | Sakshi
Sakshi News home page

మల్లాం ఆలయ ఆదాయానికి గండి

Mar 18 2026 7:42 AM | Updated on Mar 18 2026 7:42 AM

దేవుడి సొమ్ము స్వాహా

పాలకమండలి వ్యవహారశైలి

వివాదాస్పదం

చిట్టమూరు: మండలంలోని మల్లాం గ్రామంలో వెలసిన వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అలాగే వివిధ అంశాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజలకు సంబంధించిన ధరలను దేవదాయ శాఖ నిర్ణయించి బోర్డుపై ఉంచింది. అయితే అందుకు విరుద్ధంగా భక్తుల నుంచి అదనంగా వసూలు చేసి నిలువు దోపిడీ చేస్నున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో అన్నదాన పథకానికి రూ.13 వేలు తీసుకునేవారు. ప్రస్తుత రూ.20 వేలు తీసుకుంటున్నా సక్రమంగా కార్యక్రమం చేపట్టడం లేదని ప్రచారం జరుగుతోంది. పాలకమండలి కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ కావడంతో అన్నదానానికి ఉపయోగించే బియ్యం బస్తాలు కూడా విక్రయాలు జరుగుతున్నట్లు సమచారం. కొద్దిరోజుల క్రితం పలువురు నగదు కట్టి కల్యాణం జరిపించుకున్నారు. అయితే స్వామికి ఒకే పట్టువ స్త్రాలతో కల్యాణం జరిపించడాన్ని ఒకరు ప్రశ్నించి పాలకమండలి, పూజారులు, ఈఓకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. సమస్యలపై భక్తులు ప్రశ్ని స్తే మా ప్రభుత్వం.. మా ఇష్టం.. మీక్కు దిక్కున్నచోట చెప్పుకోండటంటూ సమాధానం వస్తోంది. గతంలో దర్శనానికి ఉచితంగా వెళ్లేవారు. ప్రస్తుతం టోకన్లు పెట్టి నగదు వసూలు చేస్తున్నట్లు భక్తులు తెలిపారు.

బలవంతంగా ఖాళీ

ఆలయానికి అనుసంధానంగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయిన్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు తమ వర్గం వారికి చౌకగా రూ.4 వేలకే గదులు బాడుగకు ఇప్పిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఆలయం ముందు పలువురు చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారు. వారిని ఖాళీ చేయించి నూతనంగా అద్దె గదులు నిర్మిస్తున్నారు. అవి కూడా అధికార పార్టీకి చెందిన వారికి తక్కువ రేటుకు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. హుండీ కానుకల లెక్కింపులో, వందల ఎకరాల మాగాణి భూముల ఆదాయంపై గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలపై ఆలయ ఈఓ పెంచల వరప్రసాద్‌రావును వివరణ కోరగా తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని, అన్ని లోపాలను గుర్తించి సరిచేసి దేవదాయ శాఖ నిబంధనల మేర పూజలను చేయిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement