గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆత్మహత్యలు | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆత్మహత్యలు

Mar 19 2026 7:34 AM | Updated on Mar 19 2026 7:34 AM

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వాకాడు: ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం వారిపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది’ అని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వాకాడులోని తన నివాసంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, రైతులతో రామ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు మండలాలకు చెందిన రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మిల్లర్లు ఒక్కటై రైతుల కష్టాన్ని అందినకాడికి దోచుకుపోతున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో 22 నెలల్లో దాదాపు 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాడ్పినట్లు అధికార గణాంకాల ద్వారా తెలిసిందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వంలో జిలకర మసూరి ధాన్యం పుట్టి రూ.25 వేలు ధర పలికిందన్నారు. నేడు రూ. 18 వేలకు పడిపోయిందన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తుందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని నేదురుమల్లి భరోసా ఇచ్చారు. ఆయన తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వాకాడు, చిట్టమూరు మండల కన్వీనర్లు ఏనుగు సుధాకర్‌నాయుడు, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, నేతలు ఎన్‌.హిమకుమార్‌రెడ్డి, పి.రాజశేఖర్‌రెడ్డి, డి.నాగూర్‌రెడ్డి, జి.సుధాకర్‌రెడ్డి, జి.వెంకటేశ్వర్లురెడ్డి, ఎన్‌.శ్రీధర్‌రెడ్డి, పి.శశిరెడ్డి, ఎన్‌.పెంచలరెడ్డి, రవి, ఈ.వెంకటయ్య, శేషురెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement