నెల్లూరురూరల్: జిల్లా ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అధ్యాపకులను
రిలీవ్ చేయాలి
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనానికి ఎగ్జామినర్లుగా నియమించిన అధ్యాపకులను ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ రిలీవ్ చేయాలని ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసిన నేపథ్యంలో నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న కేఏసీ కళాశాలలో ఈనెల 21వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టులు, 25వ తేదీ నుంచి రెండో విడతలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బయాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతుందన్నారు. స్పాట్ వాల్యుయేషన్‌కు హాజరుకాని అధ్యాపకులు, రిలీవ్ చేయని కళాశాలల యాజమాన్యాలపై ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్వగ్రామానికి
రాజశేఖర్ మృతదేహం
ఆత్మకూరురూరల్: పాపసాని రాజశేఖర్ మృతదేహాన్ని దుబాయ్ నుంచి బుధవారం స్వగ్రామమైన మండలంలోని నారంపేటకు తీసుకొచ్చారు. స్థానికుల కథనం మేరకు.. రాజశేఖర్ దుబాయ్‌లో సైబర్ గేట్ డిఫెన్స్ సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను కొద్దిరోజులుగా కుటుంబ సభ్యుల ఫోన్‌కు స్పందించలేదు. వారు ఆందోళన చెంది వివిధ మార్గాల ద్వారా అక్కడి కాన్సులేట్‌ను సంప్రదించారు. రాజశేఖర్ తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం వచ్చింది. అతని పాస్‌పోర్ట్ గదిలో లేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. అంత్యక్రియలు నిర్వహించారు.
విధుల్లో ఉండగా..
● గుండెపోటుతో ఎకై ్సజ్ కానిస్టేబుల్ మృతి
ఆత్మకూరు: ఎకై ్సజ్ కానిస్టేబుల్ కె.రాఘవరావు (52) విధుల్లో ఉండగా తీవ్ర గుండెపోటుకు గురై మృతిచెందాడు. కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది మంగళవారం రాత్రి పలు గ్రామాల్లో దాడులు నిర్వహించేందుకు వెళ్లారు. ఈక్రమంలో రాఘవరావు కార్యాలయంలోనే సెంట్రీ విధులు నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున తీవ్ర గుండెనొప్పితో బాధపడుతుండగా విధుల్లో ఉన్న మరో వ్యక్తి వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాఘవరావు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నరసయ్యపాళెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఏడునెలల క్రితం కనిగిరి ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం నుంచి బదిలీపై ఆత్మకూరుకు వచ్చాడు. అతడికి భార్య, కుమా రుడు ఉన్నారు. కానిస్టేబుల్ మృతి విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ సీఐ కిశోర్, సిబ్బంది కృష్ణయ్య, విజయ్‌బాబు, మరికొందరు బుధవారం ప్రభుత్వాస్పత్రికి వచ్చి సంతాపం తెలిపారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


