నెల్లూరు(క్రైమ్): ఉగాది పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన పోలీస్, విజిలెన్స్, సీఐడీ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందికి సేవా పతకాలను ప్రకటించింది. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ కె.నరసింహారావు మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకాలు లభించిన వారిలో ఎస్సై ఎన్.శ్రీనివాస్ సింగ్ (డీసీఆర్‌బీ), లీడింగ్ ఫైర్‌మెన్ జి.శ్రీనివాసులు (రాపూరు ఫైర్‌స్టేషన్), సేవా పతకం లభించిన వారిలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు (నెల్లూరు రూరల్), ఆర్‌ఐ జె.హరిబాబు (డీఏఆర్), ఏఎస్సైలు వి.చెంగయ్య (సంతపేట), ఈ.శ్రీనివాసులు (డీసీఆర్‌బీ), ఎస్‌డీ జిలానీబాషా (ఏఆర్ ఎస్సై), హెచ్‌సీలు కె.హజరత్ (కొడవలూరు), ఒ.శ్రీనివాసులు (సీఐడీ), జి.చంద్రశేఖర్ (డీఏఆర్), పి.మాలకొండయ్య (డీఏఆర్), కానిస్టేబుళ్లు బి.జయంతికుమార్ (బిట్రగుంట), షేక్ సుల్తాన్ మొహిద్దీన్ (నవాబుపేట), పి.సన్యాసినాయుడు (డీఏఆర్), ఎస్‌ఎఫ్‌ఓ డి.హరిబాబు (ఉదయగిరి ఫైర్‌స్టేషన్), ఎల్‌ఎఫ్‌లు ఎ.సుధాకర్ (ఆత్మకూరు ఫైర్ స్టేషన్), జి.వెంకటేశ్వర్లు (మర్రిపాడు ఫైర్‌స్టేషన్), డ్రైవర్ ఆపరేటర్ బి.హరిబాబు (మర్రిపాడు ఫైర్‌స్టేషన్) ఉన్నారు.
వి.చెంగయ్య,
ఏఎస్సై, సంతపేట
కె.నరసింహారావు, ఇన్‌స్పెక్టర్
శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ డీఎస్పీ


