నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని పలు హోటళ్లు, క్యాటరింగ్‌లు, టీ కేఫ్‌లు, ధాబాలపై మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. సబ్సిడీపై అందజేసే గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాల నిమిత్తం అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. 12 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయీస్ అధికారులకు అప్పగించారు. సంబంధిత యజమానులపై నిత్యావసరాల సరుకుల చట్టం సెక్షన్ 6 (ఏ) ప్రకారం చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి తెలిపారు.
పొదలకూరు నిమ్మధరలు (కిలో)
పెద్దవి: రూ.75
సన్నవి: రూ.65
పండ్లు: రూ.40


