● జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి నీరజ
వింజమూరు(ఉదయగిరి): పాలు కల్తీ చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అఽధికారిణి డాక్టర్ నీరజ తెలిపారు. వింజమూరులోని పలు పాల సేకరణ కేంద్రాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. శాపింల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ సందర్భంగా పాలు సేకరించే ఏజెంట్లకు అవగహన కల్పించారు. సేకరణ సమయంలో కల్తీ పాలను గుర్తించే విధానం గురించి తెలిపారు. కల్తీ పాలు సేకరించినట్లు రుజువైతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


