మా గ్రామంలో నిత్యం గంజాయి, మద్యం విక్రయిస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈనెల 14వ తేదీన గ్రామంలోని దేవాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయించవద్దని చెప్పినా పక్కరోజు ఆటోలో ఐదుగురు వ్యాపారులు మద్యం బాటిళ్లు దించుకుని బెల్టు షాపులు నిర్వహస్తున్నారు. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తున్నారు. స్థానిక పోలీసులకు నెల మామూళ్లు ఇస్తున్నాం ఏం చేసుకుంటారో చేసుకోండంటున్నారు.
– రాపూరు మండలం
సైదాదుపల్లి గ్రామ బీసీకాలనీ వాసులు


