టీడీపీ నేత వేధింపులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత వేధింపులు

Mar 17 2026 7:30 AM | Updated on Mar 17 2026 7:30 AM

దళిత యువకుడి ఆత్మహత్యాయత్నం

విడవలూరు: ఓ టీడీపీ నేత వేధింపులతో దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం మండలంలోని ముదివర్తిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముదివర్తి దళితవాడకు చెందిన పట్టపు రోహిత్‌ అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఈ వ్యవహారం నచ్చని యువతి తల్లిదండ్రులు అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో రోహిత్‌పై పోక్సో కేసు పెట్టించారు. అయితే ఈ కేసు హియరింగ్‌కు వచ్చిన క్రమంలో ఆ టీడీపీ నేతను రోహిత్‌ సోమవారం కలిసి న్యాయం చేయాలని కోరాడు. ఈ క్రమంలో అతడిని ‘నువ్వు దళితుడివి.. నీకు మా అమ్మాయి కావాలా?’ అంటూ కులవివక్షతో దూషించారు. ‘ఇక నీకు 14 ఏళ్లు జైలు శిక్ష పడటం ఖాయం.. ఆ జైలుకెళ్లి కుళ్లిపోవడం కంటే, గడ్డిమందు తాగి చావడం మేలు’ అంటూ కర్కశంగా మాట్లాడటంతో రోహిత్‌ తీవ్ర మానసికక్షోభకు గురయ్యాడు. టీడీపీ నేత హెచ్చరికలతో భయపడి, జీవితంపై విరక్తి చెందిన రోహిత్‌ సోమవారం గడ్డిమందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు టీడీపీ నేతనే కారణమని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసి రోహిత్‌ను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తతరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత దళితులు తమ బిడ్డను కులం పేరుతో అవమానించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన టీడీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డెత్‌ సర్టిఫికెట్‌ కోసం వినతి

సైదాపురం: ‘మా అమ్మ ఏడాది క్రితం చనిపోయింది. డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వండి’ అంటూ చీకవోలు గ్రామ సర్పంచ్‌ బట్టా వెంకటయ్య తహసీల్దార్‌ సుభద్రకు విన్నవించుకున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తమ పొలాన్ని మరొకరు ఆక్రమించుకున్నారు. సర్వేయర్‌ వచ్చినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదంటూ రైతులు విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement