కౌలురైతులకు మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

కౌలురైతులకు మొండిచేయి

Mar 14 2026 7:28 AM | Updated on Mar 14 2026 7:28 AM

నేను ఐదు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకు ని పంటలు సాగుచేస్తున్నా. గత ప్రభుత్వం రైతుభరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించడంతో కొంత ఊరట లభించింది. కూటమి ప్రభుత్వంలో కూడా అన్నదాత సుఖీభవ అందుతుందని అనుకున్నా. అయితే జాబితాలో పేరు లేదు. ఈ ప్రభుత్వం కౌలురైతులను పూర్తిగా విస్మరించింది. కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ నగదును అందించి ఆదుకోవాలి.

– చేను వెంకటయ్య, కౌలురైతు, వాకాడు

వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా. ఏటా ఐదెకరాలు మాగాణి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. గత ప్రభుత్వం కౌలురైతులకు కూడా రైతుభరోసా పథకం కింద క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందించి ఆదుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదు.

– దుగ్గన రామచంద్రయ్య,

కౌలురైతు, మనుబోలు

నేను ఏటా నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తు న్నా. గత ప్రభు త్వం కౌలురైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కౌలురైతులను చిన్నచూపు చూస్తోంది. రెండు పర్యాయాలు కౌలురైతుగా దరఖాస్తు చేసుకున్నా అన్నదాత సుఖీభవ నగదు అందలేదు. పెట్టుబడికి అప్పులు చేయాల్సి వచ్చింది. పంటలకు మద్దతు ధరలు కూడా లేక నష్టపోతున్నాం.

– వెందోటి సుధాకర్‌,

కౌలురైతు, చిట్టమూరు

చిన్నచూపు తగదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement