పీఎం కిసాన్‌ పథకానికి భారీగా కోతలు | - | Sakshi
Sakshi News home page

పీఎం కిసాన్‌ పథకానికి భారీగా కోతలు

Mar 14 2026 7:27 AM | Updated on Mar 14 2026 7:27 AM

అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు రాలేదు

అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు ప్రభుత్వం పథకానికి అనేక కొర్రీలు వేసి.. గుండె కోతను మిగిల్చింది. అర్హులు ఎవరైనా ఉంటే.. నెల రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే తిరిగి సాయం అందిస్తామంటూ ప్రతిసారి చెబుతున్నా.. ఆ దరఖాస్తులకు మూడో విడత జమవుతున్న నేటికీ దిక్కులేని పరిస్థితి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హత ఉండీ పథకం డబ్బులు రాకపోతే.. తిరిగి దరఖాస్తు చేయించి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం పథకాన్నే కాకుండా.. ప్రణాళికను కాపీ కొట్టినా చివరకు వెన్నుపోటు పేటెంట్‌ను నిలబెట్టుకుంటోంది. చంద్రబాబు చరిత్రలో రైతుల కోసం అమలు చేసిన పథకం ఒక్కటీ లేదు. అధికారం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టి.. పీఎం కిసాన్‌ సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేశారు. తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఆ తర్వాత పీఎం కిసాన్‌తో కలిపి అంటూ నాలుక మడతేసి.. రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామన్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న కౌలు రైతు పేరు బందెల ప్రసాద్‌. చేజర్ల మండలం యనమదల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రెం

డున్నర ఎకరాల కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా (పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ) ఇవ్వలేదు. గతంలో జగనన్న ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పన మూడేళ్లు రైతు భరోసా అందిందని, అది వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎంతో ఆదరువుగా ఉండేదంటున్నాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌలుకు రైతులకు పథకం వర్తించదని అధికారులు చెప్పడంతో హతాశుడయ్యాడు. నిమ్మ, మామిడి, తదితర ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు అన్నదాత సుఖీభవ జమ కావడం లేదు.

అయ్యా..నాకు సుఖీభవ

డబ్బులు పడడం లేదయ్య..

నేనేమంటానంటే..

కొందరికేనయ్య...

ఇక పడవ్‌.. వెళ్లిపో...!

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోని లబ్ధిదారులను అనేక కారణాలు చూపించి ఏరివేసింది. అధికారంలోకి రాక ముందు కౌలురైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలురైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతలతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని 84,134 మంది రైతులకు నేటికీ దిక్కులేదు.

‘సూపర్‌’ మోసం

చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏనాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని ఆయన సూపర్‌ సిక్స్‌లో భాగంగా పీఎం కిసాన్‌ సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఎగనామం పెడితే.. మలి ఏడాది సగం మందికే ఇచ్చి సరిపుచ్చారు. రెండో ఏడాదిలో తొలి విడతలో ఆర్టీజీఎస్‌ వ్యాలిడేషన్‌ తర్వాత 1,98,514 మంది రైతులను అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించినప్పటికీ చివరకు 1,95,866 మందిని ఫైనల్‌ చేశామని చెప్పారు. ఆ తరువాత ఈకేవైసీ, ఆధార్‌లింక్‌, బ్యాంకు అకౌంట్‌ లింకు కాలేదని, తదితర కారణాలు చూపి మరి కొంత మందిని తగ్గించి.. చివరకు 1,86,368 మందికి జమ చేశారు. ఆ తర్వాత 1,95,866 మందిని నికరంగా నిర్ధారించి.. మూడు విడతల్లోనూ అంతే మందికి జమ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది.

జిల్లాలో సుఖీభవ కొందరికే వర్తిపు

1,95,866 మందిని అర్హులుగా

గుర్తించిన ప్రభుత్వం

అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సాయమందిస్తామని చెప్పినా..

ఫలితం శూన్యం

84,134 మంది రైతుల

దరఖాస్తులు పెండింగ్‌

కౌలు రైతులకు పంగనామాలు

పెట్టిన కూటమి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

2,14,667 మందికి రైతు భరోసా

ఏటా రూ.20 వేలిస్తామన్న చంద్రబాబు

తొలి ఏడాది పూర్తిగా ఎగనామం

రెండో ఏడాది నుంచి పీఎం కిసాన్‌తో కలిపి అంటూ నాలుక మడత

జిల్లాలో వైఎస్సార్‌సీపీ హయాంలో 2,14,667 మంది రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా జమ అయితే.. అందరికీ పీఎం కిసాన్‌ పథకం కూడా అమలవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలో కూడా అన్నదాత సుఖీభవ జమ కాకపోయినా.. ప్రతీ ఒక్కరికీ గతంలో మాదిరిగానే పీఎం కిసాన్‌ పథకం సాయం రైతుల ఖాతాల్లో జమ అయింది. రెండో ఏడాది తొలి విడత సమయానికి కూడా పీఎం కిసాన్‌ సాయం ప్రతి ఒక్కరికీ జమ అయితే.. గడిచిన రెండు విడతలుగా భారీగా కోత పడింది. ఆధార్‌ తరహాలో విశిష్ట సంఖ్యతో కూడిన కార్డులు అంటూ ‘ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌’ను చేపట్టింది. ఈ క్రమంలో పీఎం కిసాన్‌ డేటాలో అర్హులైన రైతులకు సంబంధించిన డేటాను తొలగించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రెండో విడతతోపాటు, తాజాగా విడుదల చేసే జాబితాల్లో అర్హులైన రైతులు ఎగిరిపోయారు. ప్రస్తుతం పీఎం కిసాన్‌ కింద 1,63,125 మందికి జమ చేస్తున్నట్లు వ్యవసాయశాఖాధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య తగ్గించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందనే ఆరోపణలు లేకపోలేదు. పీఎంకిసాన్‌లో అర్హత ఉంటేనే.. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హతగా మార్చే కుట్రగా ఉందని రైతులు విమర్శిస్తున్నారు. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్‌ అర్హతనే ప్రామాణికంగా తీసుకుంటే రైతుల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని తొలి విడతలో ఎంత మందికి ఇచ్చారో మూడో విడతలోనూ అంతే మందికి సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. వీరిలో అందరికీ సుఖీభవ పడుతుందా? లేదా? అనేదానిపై కూడా రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అర్హులైన రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) ప్రదర్శించకపోవడం దీనికి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement