ప్రెస్‌మీట్ పెట్టారని వైఎస్సార్సీపీ నేత నిర్బంధం
మనుబోలు: టీడీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అపహాస్యమవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అధికార పార్టీ నేతలు అమలు చేస్తుంటే.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మనుబోలుకు చెందిన పార్టీ నేత అనమాల ప్రభాకర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ను ఇటీవల నిర్వహించి స్థానిక టీడీపీ నేత మస్తాన్‌నాయుడిపై విమర్శలు చేశాడు. దీంతో ప్రభాకర్‌రెడ్డికి 41ఏ నోటీసులను పోలీసులు శనివారం సాయంత్రం ఐదింటికిచ్చి స్టేషన్‌కు పిలిపించారు. రాత్రి వరకు స్టేషన్లో ఉంచి బైండోవర్ చేస్తామని చెప్పి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. మనుబోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారి చర్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమను దూషించిన వారిపై కేసులు నమోదు చేయకుండా.. దానికి కౌంటర్ ఇచ్చిన వ్యక్తిపై ఆగమేఘాలపై కేసు పెట్టి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు. రాజకీయంగా విమర్శలు చేసిన వ్యక్తులకు 41ఏ నోటీసులివ్వడం.. బైండోవర్ చేయడమేమిటని నిలదీశారు. ఇలాంటి పోకడలను ఎక్కడా చూడలేదని చెప్పారు. ఖాకీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎవరూ కాపాడే పరిస్థితి ఉండదని తెలిపారు. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా ఎదురు కేసులు పెట్టి వేధిస్తామంటే తాము భయపడబోమని స్పష్టం చేశారు. సోమిరెడ్డికి సిగ్గుంటే ఇరిగేషన్ పనులపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఊపిరున్నంత వరకూ పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని తెలిపారు. అవసరమైతే హైకోర్టు మెట్లైకె ్కనా శ్రేణులను కాపాడుకుంటామని పేర్కొన్నారు. పోలీసులుండేది శాంతభద్రతలను కాపాడేందుకే తప్ప ఓ వర్గానికి కొమ్ముకాయడానికి కాదనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని హితవు పలికారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, ముంగర రవీందర్‌రెడ్డి, గుంజి రమేష్, గిద్దంటి రమణయ్య, గిరి, దయాకర్, కోటేశ్వరగౌడ్, కేవీఆర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే శిక్ష తప్పదు
కార్యకర్తలను కాపాడుకుంటాం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


