చంద్రబాబు రైతు ద్రోహి
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కొడవలూరు: చంద్రబాబు రైతుల ద్రోహి అని, వారిపై పోలీసులతో కాల్పులు చేయించి హత్య చేయించిన ఘనుడని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని ఆలూరుపాడు, మానేగుంటపాడుల్లో కోటి సంతకాల కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆలూరుపాడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతన్నా మీ కోసమంటూ చంద్రబాబు కొత్త నాటకాలకు సోమవారం నుంచి తెరలేపారన్నారు. ముఖ్యమంత్రిగా రైతులకు ఏం మేలు చేశారో ఒక్కటి చెప్పాలని నిలదీశారు. ఉచిత కరెంట్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎదుట రైతులు ధర్నా చేస్తే వారిపై కాల్పులు జరిపించి ప్రాణాలు బలి తీసుకున్నట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను ఎందుకు నిర్వీ ర్యం చేశావు బాబూ అని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పుట్టి ధాన్యం రూ.24 వే లకు రైతులు అమ్ముకున్నట్లు చెప్పారు. ఇప్పుడు రూ.14 వేలకే తెగనమ్ముకుంటూ కన్నీరు కారుస్తుంటే చంద్రబాబు సర్కస్ వేషాలు వేస్తున్నాడని మండిపడ్డారు. పొగాకు, మిర్చి, ఉల్లి, జొన్న, బత్తాయి, మామిడి, మొక్కజొన్న, టమోటా, అరటి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.
రుణమాఫీలోనూ మోసమే..
2014లో రైతులకు రూ.84 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా, కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే చేసి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. సమావేశంలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరి, సర్పంచ్ మోచర్ల రమేష్, ఎంపీటీసీ కామేశ్వరి, ఇన్‌చార్జి సర్పంచ్ రాజవర్ధన్, నాయకులు కలువ బాలశంకర్‌రెడ్డి, అడపాల మోహనకృష్ణ, ఇందూరు బాలభాస్కర్‌రెడ్డి, కారంపూడి సుబ్బరామిరెడ్డి, అనపల్లి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


