మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా
సంగం: మండలంలోని మర్రిపాడు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై డీఈఓ బాలాజీరావు ఆరాతీశారు. శుక్రవారం ఆయన స్కూల్‌కు వచ్చారు. నెల్లూరుకు చెందిన డీఆర్డీఓ శాస్త్రవేత్త రాజేష్ పాఠశాలకు బహూకరించిన రూ.2 లక్షల విలువైన ర్యాక్‌లు, విద్యా సామగ్రి, వాటర్ కూలర్‌ను ప్రారంభించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న బోధన గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ జానకిరామ్, సర్పంచ్ సురేష్, ఎంఈఓ మల్లయ్య, హెచ్‌ఎం నరసింహమూర్తి, స్థానికులు అజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● అదనపు తరగతి, వంట గదులు మంజూరు చేయాలని సర్పంచ్ సురేష్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మందిపాటి అజయ్‌రెడ్డి డీఈఓకు విన్నవించారు.


