వసతి గృహాలకు గ్రహణం
సైదాపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ వసతి గృహాలకు గ్రహణం పట్టింది. ఉన్న రెండూ గృహాలను మూసివేశారు. మండల కేంద్రంలో 35 ఏళ్లుగా రెండు గృహాలు బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడుస్తుండేవి. గతంలో ఒక్కోదాంట్లో కనీసం 130 నుంచి 150 మంది విద్యార్థులుండేవారు. 31 గ్రామ పంచాయతీల విద్యార్థులు వీటిల్లో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకున్నారు. కనీసం సౌకర్యాలను కల్పి ంచకుండా గతేడాది ఉన్నత పాఠశాల సమీపంలోని బీసీ వసతి గృహాన్ని చంద్రబాబు ప్రభుత్వం మూసి వేయించింది. అక్కడున్న విద్యార్థులను మరో చోటుకు బదిలీ చేశారు. ఇక్కడ సిబ్బంది కొరత వేధించింది. కనీస వసతులను కల్పించలేదు. దీంతో విద్యార్థులు అనేక అవస్థలు పడ్డారు. జిల్లా అధికారి ఆదేశాలతో రెండు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా దీనిని కూడా మూసివేశారు. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక పేద విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహాలను అభివృద్ధి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


