కూటమి అరాచకాలకు వంత | - | Sakshi
Sakshi News home page

కూటమి అరాచకాలకు వంత

Aug 30 2025 8:48 AM | Updated on Aug 30 2025 10:43 AM

కూటమి

కూటమి అరాచకాలకు వంత

కావలికి వస్తే ఖబడ్దార్‌ అంటూ ఎమ్మెల్యే రౌడీయిజం వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిపై

అనుచిత భాషతో దూషణలు

భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసానికి

వెళ్లకుండా అడ్డగింత

మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ

చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి హౌస్‌ అరెస్ట్‌

అందరి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు

టోల్‌ప్లాజా వద్దే మాజీ మంత్రి కారుమూరిని అడ్డగింపు

ఎమ్మెల్సీ నివాసం వద్ద భారీగా చేరుకున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు

సాక్షి ప్రతినిధి,నెల్లూరు: కూటమి ప్రభుత్వం అరాచకాలకు అంతుపంతు లేకుండా పోయింది. ఇందుకు పోలీస్‌ యంత్రాంగం తోడైంది. కూటమి ఎమ్మెల్యేల ఆదేశాలే శిరోధార్యంగా భావించి వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసి అక్రమ కేసులు పెడుతూ పోలీసులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం అన్నవరంలో సాగిస్తున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారం, ముసునూరులో జరిగిన మనీ స్కీమ్‌ స్కామ్‌ను బయట పెడతానని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హెచ్చరికలను జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియా యాక్టివిస్టులు కావ్య అక్రమ మైనింగ్‌ గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డం పెట్టుకుని ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేయించడం తెలిసిందే. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు సైతం అధికార ఎమ్మెల్యేకు సాష్టాంగం పడుతూ చట్టాలను తుంగలో తొక్కి తప్పుడు కేసులు బనాయించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే అవినీతిని బహిర్గతం చేస్తామని హెచ్చరించడంతో కలవర పడిన కావ్య ప్రెస్‌మీట్‌ పెట్టి వీధిరౌడీలా మాట్లాడారు. ఎమ్మెల్యేనని స్థాయి మరిచిపోయి, పక్కనే మహిళ ఉందనే విచక్షణ కోల్పోయి అసభ్యకంగా, అనుచితంగా మాట్లాడుతూ ఊగిపోయారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి కావలి వస్తే.. ఖబడ్దార్‌ అంటూ రెచ్చిపోయారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని అయితే పత్రికల్లో రాయలేని భాషతో అనుచితంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యవహారిక భాషపై, అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండి పడ్డారు.

పోలీసుల రెడ్‌బుక్‌ రాజ్యాంగం

పోలీసులు చట్టాన్ని గౌరవించడం మానేశారు. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిని, మాజీ మంత్రిని దారుణంగా దుర్భాలాషడిన ఎమ్మెల్యేను వదిలేసిన పోలీసులు ప్రతిపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి కావలిలోని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు కాకాణి, పర్వతరెడ్డి ఇళ్ల వద్దకు నెల్లూరు వేదాయపాళెం సీఐ శ్రీనివాసరావు, బాలాజీనగర్‌ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న పోలీసులు వారిని బయటకు కదలనీయకుండా అడ్డుకున్నారు. తమ పార్టీ నేతలను పరామర్శ చేయడమే నేరంగా భావించిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాకాణితోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటిని ఆయన నివాసంలో, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆయన నివాసంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నోటీసులిచ్చి హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

కారుమూరిని వెంబడించి..

కావలిలోని ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయవాడ నుంచి వస్తున్న మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు వెంబడించారు. ఆయన్ను కావలికి చేరుకోనివ్వకుండా జాతీయ రహదారి పైనే నిలిపివేశారు. తాను పరామర్శ కోసమే వెళ్తున్నానని చెప్పినా వినిపించుకోకుండా తిరిగి విజయవాడకు పంపించారు. ఆయన వాహనాన్ని జిల్లా సరిహద్దులు దాటించే వరకు పోలీసులు వాహనాలు వెంబడించి పంపించారు.

జిల్లాలో పోలీసులు కూటమి పాలకులకు సాష్టాంగం చేస్తూ సాగిలపడుతున్నారు. చట్టాన్ని పచ్చ నేతలకు చుట్టాలుగా తయారు చేస్తున్నారు. రాజ్యాంగం అంటే గౌరవం లేదు. న్యాయవ్యవస్థ అంటే భయమూ లేదు. కూటమి నేతల అరాచకాలకు వంత పాడుతూ

జీ హుజూర్‌ అంటున్నారు. ప్రతిపక్ష నేతలను బయటకు అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటూ, నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నెల్లూరులో ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టిస్తున్నారు. కావలి ఎమ్మెల్యే వీధి రౌడీలా కారు కూతలు కూస్తే స్పందించని పోలీసులు, ప్రతిపక్ష నేతలను మాత్రం హౌస్‌ అరెస్ట్‌ చేసి అధికార పార్టీ

నేతలకు అండగా అడ్డదారులు తొక్కుతున్నారు.

కూటమి అరాచకాలకు వంత 1
1/2

కూటమి అరాచకాలకు వంత

కూటమి అరాచకాలకు వంత 2
2/2

కూటమి అరాచకాలకు వంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement