నెల్లూరు(అర్బన్): జిల్లాలో పక్కాగృహాల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్‌రాజు శుక్రవారం నెల్లూరు వచ్చి పరిశీలించారు. వెంకటేశ్వరపురంలోని గృహాలతోపా టు రూరల్ మండల పరిధిలోని కొండ్లపూడి లేఅవుట్‌లో లబ్ధిదారులకు నిర్మించిన ఇళ్లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ మోహన్‌రావు, డీఈ షంషుద్దీన్, ఏఈలు పాల్గొన్నారు.
● జిల్లాలో కాంట్రాక్టర్లు, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు కుమ్మకై ్క నివాసం ఉండేందుకు వీల్లేకుండా తూతూమంత్రంగా నిర్మాణాలు చేపట్టారంటూ బీజేపీ నాయకుడు మిడతల రమేష్ విజిలెన్స్, హౌసింగ్ అధికారులకు బంతిపూలు ఇచ్చి నిరసన తెలిపారు.