
గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి..
● తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు
● పరిస్థితి విషమం
ఉలవపాడు: గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిపై చాగల్లు సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చైన్నెకు చెందిన రత్నవేలు, గాంధీ తండ్రీకుమారులు. కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరు స్వస్తిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్నారు. ఆఫీస్ పని నిమిత్తం చైన్నెకు సొంత కారులో బయలుదేరారు. ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలోకి వచ్చేసరికి ముందు వెళుతున్న గుర్తుతెలి యని వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టి రోడ్డు మా ర్జిన్‌లోకి దూసుకెళ్లింది. ఇద్దరికీ తీవ్రగాయాలై స్పృహ కోల్పోయారు. డ్రైవింగ్ చేస్తున్న గాంధీ లోపల ఇరుక్కుపోయాడు. హైవే అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి..