
ఈ విధానాన్ని తొలగించాలి
అసెస్మెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలి. ఈ ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. బోధనేతర పనుల భారాన్ని మోపడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయలేకపోతుండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. మూల్యాంకనంలో పాత విధానాన్నే కొనసాగించాలి.
– సురేంద్రరెడ్డి,
జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్
అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయంతో అసెస్మెంట్ విధానం పిల్లలనే కాకుండా ఉపాధ్యాయులనూ పరీక్షించే విధంగా మారింది. దీని వల్ల బోధనకు వారం పాటు దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రాజెక్టుల పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారు. తరగతికి మించిన స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటోంది. ఈ పనులతో ఉపాధ్యాయులు బోధనకు దూరంగా ఉంటున్నారు.
– చలపతిశర్మ,
జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్

ఈ విధానాన్ని తొలగించాలి