
పర్వతరెడ్డి కాలి గోటికి కూడా సరిపోరు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కాలి గోటికి కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సరిపోరని పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విమర్శించారు. ఈ మేరకు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. అవహేళనగా చవకబారు మాటలు మాట్లాడితే అది మగతనం కాదని హితవు పలికారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణారెడ్డి అవినీతిని బయటపెట్టి చట్టం ముందు దోషిగా నిలబెడతామని స్పష్టం చేశారు. పార్టీ యువజన విభాగ కావలి నియోజకవర్గ అధ్యక్షుడు చైతన్య పాల్గొన్నారు.