
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి
నెల్లూరు(క్రైమ్): ఉరేసుకుని వాచ్‌మెన్ ఆత్మహత్య చేసు కున్న ఘటన నెల్లూరులోని ఆచారివీధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌కు చెందిన బికాష్ (25), శిర్జన కోలి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐదునెలల క్రితం వారు ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. ఆచారివీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బికాష్ వాచ్‌మెన్‌గా, భార్య చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 24వ తేదీ సాయంత్రం బికాష్ స్నేహితులతో కలిసి మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికొచ్చాడు. అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుండగా వారు ఎందుకు మద్యం తాగావని మందలించారు.
భార్య సైతం ఈ అలవాటు ఎందుకు చేసుకున్నావని ప్రశ్నించి భోజనం చేసేందుకు లోనికి వెళ్లింది. ఈక్రమంలో బికాష్ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. భోజనం ముగించుకుని హాల్లోకి వచ్చిన ఆమె భర్త ఉరేసుకుని ఉండటాన్ని గమనించింది. పక్కవీధిలో ఉంటున్న తన అన్నయ్యకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. అందరూ కలిసి బికాష్‌ను చికిత్స నిమిత్తం రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. శిర్జన సోమవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.