
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా ఫుట్‌బాల్ పోటీలను శనివారం ప్రారంభించారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు, బరోడా బ్యాంకు రిటైర్డ్ జీఎం అనిల్‌కుమార్ పోటీలను ప్రారంభించారు. సీనియర్ క్రీడాకారులు ప్రతాప్, చిట్టి, చలపతి, సురేష్, సీనియర్ ఫుట్‌బాల్ ప్లేయర్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మలిరెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు ఫలితాలు
వైఎస్సార్ కడప జట్టుపై అనంతపురం జట్టు 2–1 గోల్స్‌తో గెలుపొందగా, ఎన్టీఆర్ జిల్లా– వైఎస్సార్ జిల్లాపై 5–0 గోల్స్‌తో, నెల్లూరు జిల్లా జట్టు – ఎన్టీఆర్ జిల్లాపై 2–0 గోల్స్‌తో, అనంతపురం జట్టు –పల్నాడుపై 10–0 గోల్స్‌తో, నెల్లూరు–వైఎస్సార్ జిల్లాపై 5–0 గోల్స్‌తో, వైఎస్సార్ కడప–పల్నాడు జిల్లా జట్టుపై 7–0 గోల్స్‌తో విజయం సాధించాయి. ఆదివారం ఉదయం సెమీఫైనల్స్, మధ్యాహ్నం ఫైనల్స్, బహుమతు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి బి.చంద్రశేఖర్ తెలిపారు.