
శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ
రాపూరు: మండలంలోని పెంచలకోనలో కొలువైన ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవి సమేత పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి ఊంజల్‌సేవ శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకార మండపంలోకి తీసుకొచ్చి అక్కడ తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్‌సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం ఆగమోక్తంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రైలు కింద పడి
వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయమహల్ గేటు సమీపంలో నెల్లూరు వైపు వచ్చే రైలు పట్టాలపై శనివారం చోటుచేసుకుంది. మృతుడు సుమారు 45 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు కలిగి లేత పసుపురంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ