
ఉదయగిరిలో ఈదురుగాలుల బీభత్సం
ఉదయగిరి: ఉదయగిరి పట్టణంలో వారంరోజులుగా ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలికి మంగళవారం పట్టణ సమీపంలోని స్టీట్‌పేటలో విద్యుత్ తీగ తెగి పడిపోగా త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని తొలగించి లైను సరిచేశారు. చెట్లకొమ్మలు, హోర్డింగులు నేల వాలిపోతున్నాయి. గాలులకు ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
29న శ్రీవారికి చందనాలంకారం
రాపూరు: మండలంలోని పెంచలకోలనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి 29వ తేదీన చందనాలంకరణలో దర్శనమివ్వనున్నట్లు దేవస్థాన అధికారులు మంగళవారం తెలిపారు. ఆరోజు స్వాతి నక్షత్రం స్వామి జన్మ నక్షత్రం కావడంతో ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 9 గంటలకు శాంతి హోమం, 10 గంటలకు కల్యాణం, రాత్రి 7 గంటలకు బంగారు గరుడసేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిశీలన
సోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని సోమశిల గ్రామంలో ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మత్స్యశాఖాధికారి సురేష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపయోగంలో ఉన్న ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు జంగిల్ క్లియరెన్స్‌కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ ఏడాది చివరన ఉత్పత్తి చేసిన చేప పిల్లలను సోమశిల జలాశయంలో వదులుతామన్నారు. ఆయన వెంట మత్స్యశాఖ సిబ్బంది ఖలీల్, లోకేశ్ ఉన్నారు.

ఉదయగిరిలో ఈదురుగాలుల బీభత్సం