
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు
●
అనుమతుల్లేని స్కూళ్లపై చర్యలు చేపట్టాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు పలుమార్లు వినతిపత్రాలను అందజేసినా ప్రయోజనం లేదు. కార్పొరేట్ యాజమాన్యాల నుంచి మామూళ్లను భారీగా పుచ్చుకొని పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా, మిన్నకుండిపోతున్నారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి.
– ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ
నోటీసులను
మరోసారి జారీ చేస్తాం
అనుమతుల్లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్న యాజ మాన్యాలకు గతంలో నోటీసులను జారీ చేసి వివరణ కోరాం. మరికొందరు పంపాల్సి ఉంది. మరోసారి నోటీసులను జారీ చేస్తాం. పాఠశాలలకు అనుమతి ఉండాల్సిందే.
– బాలాజీరావు, డీఈఓ

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు