
మేల్ నర్సులపై జూనియర్ డాక్టర్ దాడి
● సర్వజన ఆస్పత్రిలో ఉద్రిక్తత
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న మేల్ నర్సు వెంకటప్ప అలియాస్ వెంకట్‌పై సోమవారం రాత్రి ఇంటర్నషిప్ (జూనియర్) డాక్టర్ ఒకరు దాడి చేశాడు. మరో మేల్ నర్సు కల్యాణ్ అడ్డుపడగా అతడిపై కూడా దాడి చేశాడు. ఆ డాక్టర్‌కు మరో జూనియర్ అండగా ఉండి దాడి చేశారని సమాచారం. ఈ విషయమై పలువురు మేల్, ఫిమేల్ నర్సులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు. దాడికి గురైన మేల్ నర్సులిద్దరూ తాము అడ్మిట్ అవుతామని, దాడికి కారణమైన వారిపై మెడికల్ లీగల్ కేసు నమోదు చేయాలని కోరగా క్యాజువాలిటీలో ఉన్న డ్యూటీ డాక్టర్ కిరణ్ తిరస్కరించాడు. దీంతో చాలాసేపు ఆందోళన జరిగింది. కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో దాడి చేసిన జూనియర్ డాక్టర్‌పై కేసు పెట్టేందుకు మేల్ నర్సులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి గొడవకు కారణాలపై ఆరాతీశారు.