
బార్ల ఏర్పాటుకు గెజిట్ విడుదల
నెల్లూరు (క్రైమ్): నూతన పాలసీకి అనుగుణంగా జిల్లాలో 2025 – 28 సంవత్సరానికి గానూ ఓపెన్ కేటగిరీ కింద 50 బార్ల ఏర్పాటుకు గెజిట్‌ను కలెక్టర్ ఆనంద్ సోమవారం విడుదల చేశారు. ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ / హెబ్రిడ్ విధానాల్లో సోమవారం నుంచి 26వ తేదీ సాయంత్రం ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ.. కలెక్టర్ సమక్షంలో 28న లాటరీ తీసి ప్రొవిజనల్ లైసెన్స్‌లను మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య తన కార్యాలయంలో డీపీఈఓ శ్రీనివాసులునాయుడితో కలిసి వెల్లడించారు.
జిల్లాలో ఇలా..
మూడేళ్ల కాలపరిమితితో నగరంలో 38.. కావలిలో ఏడు.. కందుకూరులో మూడు.. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి చొప్పున 50 బార్లు ఏర్పాటు కానున్నాయి. జనాభా ప్రాతిపదికన మూడు శ్లాబుల్లో లైసెన్స్ ఫీజులను ఖరారు చేశారు. నగరంలో రూ.75 లక్షలు.. కావలి, కందుకూరులో రూ.55 లక్షలు.. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీల్లో రూ.35 లక్షలుగా నిర్ణయించారు. ఏటా పది శాతం లైసెన్స్ ఫీజును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని రూపేణా తొలి ఏడాది రూ.36.17 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుంది.
దరఖాస్తు ప్రక్రియ..
● నూతన బార్ పాలసీలో దరఖాస్తు ఫీజుగా రూ.ఐదు లక్షలు (నాన్ రీఫండబుల్)ను ఖరారు చేశారు.
● ఆన్‌లైన్లో oc. hpfsproject. com ద్వారా ఎక్కడి నుంచైనా ఫారం – బీ (ఆర్)లోని వివరాలను నింపి దరఖాస్తును సమర్పించొచ్చు. దరఖాస్తు రుసుము, ప్రొసెసింగ్ ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు.
● ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకునేవారు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో సమర్పి ంచాలి. దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ ఫీజు రూ.ఐదు లక్షలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పేరుపై, రూ.పది వేలు కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పేరుపై సమర్పించాలి. దీనికి గానూ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
● ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఒక వ్యక్తి ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. నూతన బార్లు సెప్టెంబర్ ఒకటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
గీత కులాలకు ఐదు బార్లు
జిల్లాలో గీత కులాల కోసం ఐదు బార్లను ప్రత్యేకంగా కేటాయించారు. నెల్లూరు నగరపాలక సంస్థలో గౌడ కులస్తులకు రెండు బార్లను కేటాయించగా, లైసెన్స్ ఫీజుగా రూ.37.50 లక్షలను నిర్ణయించారు. కావలి మున్సిపాల్టీలో గమళ్ల.. కందుకూరులో గౌడ కులస్తులకు కేటాయించి.. లైసెన్స్ ఫీజుగా రూ 27.5 లక్షలను ఖరారు చేశారు. అల్లూరు నగర పంచాయతీలో గౌడ కులస్తులకు ఒక బార్‌ను కేటాయించి.. లైసెన్స్ ఫీజుగా రూ 17.5 లక్షలను నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ 20న విడుదల కానుంది. అదే రోజు నుంచి 29వ తేది సాయంత్రం ఐదు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 30న లాటరీ విధానంలో బార్లను కేటాయించనున్నామని డీసీ తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్లు రమేష్, కిశోర్, శ్రీనివాసరావు, ఎస్సై ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఓపెన్ కేటగిరీలో
50కు అనుమతులు
ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్లో
దరఖాస్తుల స్వీకరణ
26తో ముగియనున్న గడువు
28న కలెక్టర్ సమక్షంలో లాటరీ