
వేమిరెడ్డితో బెడిసిందా!
● రూప్‌కుమార్ ఫ్లెక్సీల్లో
వీపీఆర్ ఫొటో లేకపోవడంపై చర్చ
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లా పాలిటిక్స్‌లో ప్రధానంగా టీడీపీలో ఒక చర్చ నడుస్తోంది. ఇది ప్రస్తుత తరుణంలో హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని తీసుకెళ్లడంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్‌కుమార్ మంత్రాంగం నడిపించారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో మైనింగ్ వ్యవహారంలో కూడా రూప్‌కుమార్ పార్టీ అధిష్టానం వద్ద ఎంపీ వేమిరెడ్డిని ముందు పెట్టి వెనుక నుంచి వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఏడాది కాలంగా జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది. జిల్లాలోని మొత్తం మైన్లను తన గుప్పెట్లో పెట్టుకుని రూప్‌కుమార్ ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నట్టు ఉండి.. ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాను మైనింగ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్టన్లు ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగంగా ప్రకటించారు. వేమిరెడ్డి కోటరీలో కీలక నేతగా ఉన్న రూప్‌కుమార్ కొద్ది రోజులుగా మరో కోటరీతో రాసుకునిపూసుకుని తిరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రూప్‌కుమార్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఆయన అభిమానులు నగరంలో ఫ్లెకీలను నింపేశారు. అందులో పార్టీ పెద్దలు చంద్రబాబు, లోకేశ్, డీసీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఎన్టీఆర్ ఫొటోలు ఉన్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఫొటో లేకపోవడంపై టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా రెండు రోజులుగా రూప్‌కుమార్ మంత్రి నారాయణ వెంటనే కార్యక్రమాల్లో పాల్గొంటుండడం కూడా ఈ చర్చకు అద్దం పడుతోంది. వేమిరెడ్డి, రూప్‌కుమార్ మధ్య ఏమన్నా బెడిసిందా ఏమిటి అనే చర్చ సొంత పార్టీ లోనే హాట్‌టాపిక్‌గా మారింది.