తమ్ముళ్లకు కాసులు.. కూలుతున్న కాపురాలు | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు కాసులు.. కూలుతున్న కాపురాలు

May 24 2025 12:10 AM | Updated on May 24 2025 12:10 AM

తమ్ము

తమ్ముళ్లకు కాసులు.. కూలుతున్న కాపురాలు

ఉదయగిరి: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ ద్వారా తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంటే.. కాపురాలు ఆర్థికంగా కుప్ప కూలిపోతున్నాయి. గత ప్రభుత్వం మద్యం విక్రయాలను పరిమిత స్థాయిలో చేపట్టితే.. కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తోంది. ఒక పక్క సంక్షేమ పథకాలు అటకెక్కాయి. మరో పక్క బతుకుదెరువు పనులు లేకుండా పోయాయి. అదే సమయంలో ఊరికి 2 నుంచి 10 బెల్టుషాపుల ద్వారా టార్గెట్‌ నిర్దేశించి అమ్మకాలు సాగిస్తోంది. బెల్టు షాపులకు దుకాణాల నిర్వాహకులే నేరుగా సరఫరా చేస్తుండడంతో ప్రతి బాటిల్‌పై రూ.20 వంతున అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో బెల్టు నిర్వాహకులు తమ లాభాల కోసం అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీపై రూ.20 దుకాణ యజమానులు వసూలు చేసుకుంటుంటే.. దానిపై మరో రూ.40 నుంచి రూ.50 వరకు బెల్టుషాపుల యజమానులు వసూలు చేస్తున్నారు. దీంతో తక్కువ ధరకు మద్యం అనే ప్రచారం ఉత్తిదే అని స్పష్టమవుతోంది. ఉదయగిరి మండలంలో అయితే 25 పైగా బెల్టు షాపులు ఉన్నాయి.

24X7 మద్యం.. రూ.50 అదనం

నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి పగలు తేడా లేకుండా చిన్న పల్లెలో సైతం మద్యం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. బెల్టు షాపుల నిర్వాహకులు ప్రతి బాటిల్‌పై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. విచ్చలవిడిగా బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు సాగుతున్నా ఎకై ్సజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదు. ప్రతి బెల్టు షాపు నుంచి ఎకై ్సజ్‌ అధికారులు నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రతి మద్యం షాపునకు అనుబఽందంగా అనుమతులు లేకుండా పర్మిట్‌ రూములు ఏర్పాటు చేసి మద్యం తాగిస్తున్నారు. పలు మద్యం షాపులు వేళలు పాటించకుండా ఉదయం, రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా మద్యం విక్రయాలు సాగిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్దేశించిన సమయాల్లోనే ప్రభుత్వ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరగ్గా, ప్రస్తుత ప్రభుత్వం మద్యం షాపులు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించి గ్రామ గ్రామాల బెల్టు షాపులు ఏర్పాటు చేయించి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. దీంతో అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడం, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికావడం, అనేక ఇళ్లలో మద్యం చిచ్చు రగులుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉదయగిరి నియోజకవర్గంలోని పల్లెలు మద్యం మత్తులో జోగుతున్నాయి. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకే ఇస్తామని ప్రచారం చేసిన కూటమి పాలకులు.. ఇప్పుడు ప్రైవేట్‌ దుకాణాలు ఏర్పాటు చేసి మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు. పల్లెపల్లెలో.. వీధి వీధికి బెల్టుషాపులు పెట్టి 24X7 తరహాలో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇంటి వద్దనే మద్యం అందిస్తున్నామనే నెపంతో

అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

ఊరూరా.. వీధివీధిలో విచ్చలవిడిగా బెల్టుషాపులు

అధిక ధరలకు విక్రయాలు..

మందుబాబుల జేబులకు చిల్లు

కొండాపురం మండలంలో అధికారికంగా 3 మద్యం షాపులు కేటాయిస్తే.. 45 గ్రామాల్లో బెల్టు విక్రయాలు సాగుతున్నాయి. ఇందులో ఇరవై గ్రామాలకు పైగా రెండు నుంచి ఐదు బెల్టు షాపులు ఉండడం గమనార్హం. ఈ మండలంలో మద్యం షాపు నిర్వాహకులే బెల్టు షాపుల నిర్వాహకుల మధ్య పోటీ పెట్టి వారి నుంచి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంవత్సరానికి కప్పం కట్టించుకుంటున్నారు. గ్రామంలో ఒక్క బెల్టు షాపు నిర్వహించుకునేందుకు ఈ సదుపాయం ఏర్పాటు చేశారు.

జలదంకి మండలంలో 4 దుకాణాలు ఉండగా 35 గ్రామాల్లో బెల్టు షాపులున్నాయి. ఇందులో చామదల, కొత్తపాళెం తదితర ఒక్కొక్క గ్రామంలో 3 నుంచి 5 బెల్టు షాపులు ఉన్నాయి. మద్యం షాపు నిర్వాహకులు తమ సొంత వాహనాల ద్వారా తీసుకెళ్లి బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం అదనంగా బెల్టు షాపు ఓనర్ల నుంచి ప్రతి బాటిల్‌పై రూ.20 వసూలు చేస్తున్నారు.

కలిగిరి మండలంలో 4 మద్యం దుకాణాలు ఉండగా 35 గ్రామాల్లో బెల్టు షాపులున్నాయి. ఇందులో 20 గ్రామాల్లో రెండు కంటే ఎక్కువ బెల్టు షాపులు ఉన్నాయి.

సీతారామపురంలో 35 గ్రామాల్లో బెల్టు షాపులు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో 2 లేదా అంతకంటే ఎక్కువ బెల్టు షాపులు ఉండడం గమనార్హం.

వరికుంటపాడు మండలంలో 40 గ్రామాలకు పైగా బెల్టు షాపుల విక్రయాలు సాగుతున్నాయి. ఒక్క వరికుంటపాడు మండల కేంద్రంలోనే 12 బెల్టు షాపులు ఉన్నాయి. దాదాపు 20 గ్రామాల్లో 2 లేది అంతకంటే ఎక్కువ సంఖ్యలో బెల్టు షాపులున్నాయి.

వింజమూరు మండలంలో 20 గ్రామాలకు పైగా బెల్టుషాపులున్నాయి. బుక్కాపురం, కిస్తీపురం గ్రామాల్లో బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించి మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. దాదాపు పది గ్రామాల్లో ఒక్కొక్క ఊరులో 2 నుంచి 5 బెల్టుషాపులున్నాయి.

తమ్ముళ్లకు కాసులు.. కూలుతున్న కాపురాలు1
1/1

తమ్ముళ్లకు కాసులు.. కూలుతున్న కాపురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement