బిల్లుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
● ఎస్‌ఈ విజయన్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి’ అని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్ ఆదేశించారు. నెల్లూరులోని విద్యుత్ భవన్ నుంచి గురువారం ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రతలు పాటించాలన్నారు. అదనపు విద్యుత్ వినియోగిస్తున్న వారు స్వచ్ఛందంగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో లేదా విద్యుత్ ఉపకేంద్రాల్లో అధికారులను కలిసి దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పి ంచామన్నారు. కాన్ఫరెన్స్‌లో పీఎం సూర్యఘర్ జిల్లా నోడల్ అధికారి శేషాద్రి బాలచంద్ర, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి తదితరులు పాల్గొన్నారు.


