ఫామ్‌ హౌస్‌లో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఫామ్‌ హౌస్‌లో చోరీ

Apr 27 2025 11:59 PM | Updated on Apr 27 2025 11:59 PM

ఫామ్‌ హౌస్‌లో చోరీ

ఫామ్‌ హౌస్‌లో చోరీ

పొదలకూరు: రాపూరు – పొదలకూరు మార్గంలోని ఇనుకుర్తి సమీపంలో మెయిన్‌రోడ్డు పక్కనే ఉన్న ఫామ్‌ హౌస్‌లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. పొదలకూరులో నివాసం ఉంటున్న పెంచలరెడ్డి.. ఇనుకుర్తి సమీపంలోని జామతోటలో ఫామ్‌ హౌస్‌ను నిర్మించారు. దీని ముందుభాగంలో మెయిన్‌ రోడ్డుకు సమీపంలో ఆయన బావ యానాదిరెడ్డి కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్‌ షాపును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫామ్‌ హౌస్‌ గ్రిల్స్‌ తాళాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టి, ఇంటి తలుపు లాక్‌ను తొలగించి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.పది వేలను అపహరించారు. కూల్‌డ్రింక్స్‌ షాపు తాళాలను తెరిచి కలియతిరిగా రు. అక్కడ నగదు, ఇతర సామగ్రి లేకపోవడంతో ఐస్‌క్రీమ్స్‌, మజ్జిగ ప్యాకెట్లను తస్కరించారు. బాధితుడు పెంచలరెడ్డి ఫిర్యాదు మేరకు ఘటన స్థలాన్ని ఎస్సై హనీఫ్‌ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement