పోలీస్‌ అధికారి బంధువు పేరుతో.. | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అధికారి బంధువు పేరుతో..

Apr 26 2025 12:17 AM | Updated on Apr 26 2025 12:17 AM

పోలీస్‌ అధికారి బంధువు పేరుతో..

పోలీస్‌ అధికారి బంధువు పేరుతో..

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కావలి– ముసునూరు మధ్య ప్రధాన రహదారి పక్కనే రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు కనుమరుగై పోతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కావలి సమీపంలో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌, రామాయపట్నంలో పోర్టు నిర్మాణంతో చుట్టు పక్కల పరిసరాల్లో భూముల విలువలకు రెక్కలొచ్చాయి. పట్టణ పరిధిలో ప్రైవేట్‌ స్థలాలు దొరకడం గగనంగా మారింది. ఈ క్రమంలో కావలి– ముసునూరు మధ్య ప్రధాన రహదారి పక్కన కమర్షియల్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌లు విస్తరించాయి. ఇదే సమయంలో ప్రభుత్వ స్థలాలపై కూటమి నేతల కన్ను పడింది. ఆ స్థలాలపై టీడీపీ నేతలు రాబందుల్లా వాలిపోతున్నారు. తాజాగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఆక్రమణలు చేసి విక్రయించుకుంటున్నారు.

కావలి మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి వెంబడి ముసునూరులోని అయ్యప్పగుడి వద్ద ఖరీదైన స్థలాన్ని పలువురు రాజకీయ దళారులు కాజేశారు. సర్వే నంబర్‌ 911–1, 2, 3 భిన్నాల్లో ప్రభుత్వ అనాధీనం, పోరంబోకు భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఆ సర్వే నంబర్‌లో ఉన్న దాదాపు 150 అంకణాలు రూ.5 కోట్లు విలువ చేసే స్థలాన్ని కొందరు రాజకీయ నాయకులు రెవెన్యూ రికార్డులనే తారు మారు చేసి విక్రయించడం కలకలం రేపుతోంది.

ప్రధాన రహదారి పక్కనే రూ.5 కోట్ల స్థలం హాంఫట్‌

ప్రభుత్వ భూమి రికార్డులు

తారుమారు చేసి కబ్జా

పోలీస్‌ అధికారి బంధువు పేరుతో మార్పిడి

రాత్రికి రాత్రే గదుల నిర్మాణం

ఆ ఖరీదైన స్థలాన్ని కావలిలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌ అధికారి సమీప బంధువు పేరుతో రికార్డులు మార్చేసినట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రధాన రహదారి వెంబడి ఖరీదైన ఆ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో కాపాడుకుంటూ వచ్చారు. ఎవరి ఆక్రమణలోకి వెళ్లకుండా కాపు కాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రికార్డులే తారుమారు చేసి స్థలాన్ని కాజేయడంపై కావలి వాసులు మండి పడుతున్నారు. అధికారులు సైతం కళ్ల ముందే దురాక్రమణ జరుగుతున్నా కబ్జాదారులతో కుమ్మకై ్క వారికి తమ వంతు సహకారం అఽందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ దురాక్రమణ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement